Skip to main content

ఆర్కుట్ స్నేహం... ఫ్లోరైడ్.. ఒక అవార్డు

12.7.2010న నేను ఆంధ్రజ్యోతి 'నవ్య'లో ఆర్కుట్ స్నేహం... ఫ్లోరైడ్ చిత్రం శీర్షికన రాసిన వ్యాసం ఇది. నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్య నేపద్యం లో తీసిన ఈ డాక్యుమెంటరికి నాశిక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ జ్యూరి  అవార్డు వచ్చింది. అవార్డు.. డాక్యుమెంటరి తీసిన టీం ఫోటోలు.. వ్యాసం..






Comments

Anonymous said…
మీ వ్యాసానికి అవార్డా లేక అవార్డొచ్చిన డాక్యుమెంటరీపై మీ వ్యాసమా ?
Anonymous said…
we need answer for the above question mee vyasaniki awrdaa leka awardochina documentary pai mee vyasama?

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

కొన్ని షాపుల పేర్లు బావుంటాయి... మరికొన్నింటి పేర్లు......

  కొన్ని షాపుల పేర్లు బావుంటాయి... మరికొన్నింటి పేర్లు మస్త్ ఉంటాయి... ఇంకొన్నింటి పేర్లు క్రియేటివ్‌గా ఉంటాయి...క్రియేటివిటీలో ఫీల్ ఉంటుంది...అర్థం చేసుకుంటే షాపు బోర్డులోనూ ఫిలాసఫీ ఉంటుంది. అలాంటి పేర్ల మిక్చర్ పొట్లాం.. ఈ మోర్ దాన్ మోర్. I wandered lonely as a cloud That floats on high oer vales and hills, When all at once I saw a crowd, A host, of golden daffodils; (నేను ఒంటరిగా ఒక మేఘంలా తిరిగాను. లోయలు, గుట్టల మీదుగా. అప్పుడు నేనొక సమూహాన్ని చూశాను. అందమైన గోల్డెన్ డాఫొడిల్స్ పువ్వులు అవి) విలియమ్ వర్డ్‌స్మిత్ రాసిన ‘ద డాఫొడిల్స్’ పోయమ్‌లోని మొదటి భాగమిది. ఇంటర్మీడియట్‌లో బట్టీపట్టినట్లు గుర్తు. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి యూసుఫ్‌గూడ వెళ్తుంటే వెంకటగిరిలో డాఫోడిల్స్ పేరుతో ఫ్యామిలీ సెలూన్ కనిపిస్తుంది. డాఫొడిల్స్ అంటే మెట్ట తామర పువ్వులు అని అర్థం. పసుపు రంగులో అందంగా ఉంటాయవి. వర్డ్‌స్మిత్‌ని తన్మయ పరిచిన ఆ పువ్వులు సెలూన్ నిర్వాహకులనూ కదిలించి ఉంటాయి. అందుకే డిఫంట్‌గా ఉండాలని ఆ పేరు పెట్టారేమో. చూసే మనసు.. వెతికే కళ్లు ఉండాలిగానీ.. అలాంటి విభిన్నమైన ...