Skip to main content

మార్చురీలో చూసిన శవాలు.. అర్థరాత్రి నీతో గడిపిన క్షణాలు ఇప్పుడు కళ్ల ముందు కదులుతున్నాయి నేస్తమా...


‘సీనియర్ పాత్రికేయులు బాలస్వామి మృతి’... ఈ వార్త పేపర్లో చూడగానే నాకు పెద్దగా బాధనిపించలేదు. బాధపడడానికి ఆయన నాకేం పరిచయం లేని వ్యక్తి కాదు. బాగా పరిచయం. నాలుగేళ్ల అనుబంధం. ఏడాది కలిసి పనిచేసిన అనుభవం. అయినా నాకెందుకు బాధ అనిపించడం లేదు? పసిపాప నవ్వుని చూసి.. ప్రవహించే సెలయేటిని చూసి పరవశించి పోయే నాకు.. రోడ్డుపై పారే రక్తాన్ని.. మార్చురీలో కోసిన శవాల్ని, బండరాయితో మోదిన తలకాయల్ని, చెరువులో తేలిన చిన్నారుల్ని, ఫ్యానుకు ఉరేసుకున్న అమ్మాయిల్ని చూపించిన వ్యక్తి బాలు. ఎందుకు నేస్తమా నన్నింత కరుడుగట్టిన వాడిలా చేశావు? నీవు లేవని తెలిశాక.. పెద్దగా స్పందించకుండా తయారు చేశావు? నీవు లేకపోయినా నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. ఉస్మానియా మార్చురీలో నీతో కలిసి చూసిన శవాలు.. అర్థరాత్రి రెండు మూడు గంటల వరకు ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో గడిపిన క్షణాలు కళ్ల ముందు కనిపిస్తూ నన్ను కకావికలం చేస్తున్నాయి దోస్త్.
---
బాలస్వామికి క్రైమ్ రిపోర్టర్‌గా మంచి పేరుంది. కొంత కాలం ప్రజాశక్తిలో పనిచేశాడు. అప్పుడు నేను ఏ ఇంటరో డిగ్రీనో చదువుతుండి ఉంటాను. బాలస్వామి ఉద్యోగం మానేసి సొంత ఊరికి వెళ్లి ప్రయివేటు స్కూల్ పెట్టాడు. కొంత కాలం బాగానే నడిచింది. తర్వాత లాస్ రావడంతో స్కూల్ మూసేసి మళ్లీ ఫ్యామిలీతో హైదరాబాద్ వచ్చాడు. కాచిగూడలో ఉంటూ ప్రజాశక్తిలో చేరాడు. అప్పటి వరకు ఒంటరిగా సిగరెట్ తాగే నాకు మంచి కంపెనీ దొరికింది. బాలుని నాకు ఆ సిగరెట్టే మరింత దగ్గర చేసింది. అతని సర్వీస్ అంత ఉండేది కాదు నా వయసు. కానీ రా అని పిలుచుకునేంత దగ్గరయ్యాం.
- నేనప్పుడు ప్రజాశక్తి హైదరాబాద్ డెస్క్‌లో సబ్ ఎడిటర్‌గా చేస్తుండేవాడ్ని. పేజీకి ఐటమ్స్ తక్కువ పడితే ఎన్ని వార్తలు కావాలి చెప్పు అని అడిగేవాడు. ఎన్ని వార్తలయినా.. ఎంత రాత్రి అయినా టక టకా.. రాసిచ్చేవాడు.
- పెద్ద స్టోరీలు అవసరమయినప్పుడు అంత రాత్రయినా టక టకా రివ్యూలు రాసేవాడు.
- సిటీలో పెద్దగా నేరాలు జరగగపోతే బాధపడేవాడు. క్రైం రిపోర్టర్ జీవితాలంటే ఇంతేరా? ఏ మార్డరో.. మానభంగమో.. యాక్సిడెంటో.. బాంబు బ్లాస్టో.. ఏదో జరిగితేనే స్టోరీలు.. ఏం జీవితంరా బాబు... అని బాధపడేవాడు.
- రాత్రి పదగొండు గంటలకు నేరాలేం లేక మేజర్ స్టోరీ కోసం ఎదురు చూస్తున్నప్పుడు నీవేం బాధపడకు ఇంకో గంటలో ఏదో  ఒకటి జరుగుతుంది చూడని చెప్పేవాడు. అలా జరిగిన సంఘటనలు నాకు చాలా తెలుసు?
- రాత్రంతా డెస్క్‌లో డ్యూటీ చేసి ఉదయం, మధ్యాహ్నం నేను ఎక్కువగా బాలుతో తిరుగుతుండేవాడ్ని.
- ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ, యాక్సిడెంట్లు, మర్డర్లు, ఫైర్ యాక్సిడెంట్లు, పోలీస్ స్టేషన్లు, ఇరానీ కేఫ్‌లు ఇవీ మా మీటింగ్ స్పాట్లు.
- మొదటిసారి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లినప్పుడు బాలు నాకు మార్చురీ చూపించాడు. నేను భయం భయంగా కిటికీలోంచి శవాలను చూస్తుంటే.. ‘ఏ.. ఎందుకురా అంత భయం. నడువ్ లోపలికి’ అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్లాడు. ఆ హాలులో ఓ మూలన శవాల గుట్టలు.. ఒక్కో దిమ్మపై ఒక్కో శవం.. కొన్ని సగం కోసి ఉన్నాయి. ‘ఇదేరా జీవితం రేపు నిన్నయినా.. నన్నయినా ఇలానే కోస్తారు’ అని బాలు అన్నమాటలకు ఆ రోజు పెద్దగా స్పందించలేదు కానీ.. ఇప్పుడు ఆ మాటలు గుర్తుతెచ్చుకుని కనీసం బాధపడడానికి ప్రయత్నిస్తున్నాను బాలు.

Comments

Anonymous said…
very sad

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

కొన్ని షాపుల పేర్లు బావుంటాయి... మరికొన్నింటి పేర్లు......

  కొన్ని షాపుల పేర్లు బావుంటాయి... మరికొన్నింటి పేర్లు మస్త్ ఉంటాయి... ఇంకొన్నింటి పేర్లు క్రియేటివ్‌గా ఉంటాయి...క్రియేటివిటీలో ఫీల్ ఉంటుంది...అర్థం చేసుకుంటే షాపు బోర్డులోనూ ఫిలాసఫీ ఉంటుంది. అలాంటి పేర్ల మిక్చర్ పొట్లాం.. ఈ మోర్ దాన్ మోర్. I wandered lonely as a cloud That floats on high oer vales and hills, When all at once I saw a crowd, A host, of golden daffodils; (నేను ఒంటరిగా ఒక మేఘంలా తిరిగాను. లోయలు, గుట్టల మీదుగా. అప్పుడు నేనొక సమూహాన్ని చూశాను. అందమైన గోల్డెన్ డాఫొడిల్స్ పువ్వులు అవి) విలియమ్ వర్డ్‌స్మిత్ రాసిన ‘ద డాఫొడిల్స్’ పోయమ్‌లోని మొదటి భాగమిది. ఇంటర్మీడియట్‌లో బట్టీపట్టినట్లు గుర్తు. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి యూసుఫ్‌గూడ వెళ్తుంటే వెంకటగిరిలో డాఫోడిల్స్ పేరుతో ఫ్యామిలీ సెలూన్ కనిపిస్తుంది. డాఫొడిల్స్ అంటే మెట్ట తామర పువ్వులు అని అర్థం. పసుపు రంగులో అందంగా ఉంటాయవి. వర్డ్‌స్మిత్‌ని తన్మయ పరిచిన ఆ పువ్వులు సెలూన్ నిర్వాహకులనూ కదిలించి ఉంటాయి. అందుకే డిఫంట్‌గా ఉండాలని ఆ పేరు పెట్టారేమో. చూసే మనసు.. వెతికే కళ్లు ఉండాలిగానీ.. అలాంటి విభిన్నమైన ...