Skip to main content

సినిమా చూడండి.. స్క్రిప్ట్ చడవండి.. !

సినిమా..
చూడడంలో థ్రిల్ ఉంటుంది.
స్రిప్ట్...
చదివితే మజా వస్తుంది.
చూసిన సినిమా స్క్రీన్‌ప్లే చదవడమంటే..
అమ్మ చేతితో ఆవకాయ ముద్ద తినడమే.
బాలీవుడ్‌లో ఇప్పుడు ఇదో ట్రెండ్.
అందుకే చూడండి.. చదవండి.


స్లోగా..
కెమెరా రోజ్ మొహం
మీదికి తీసుకెళ్తాం..
ట్రాన్సిషన్ (మార్పు)
Avatar tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema106 - ఇంటీరియర్ - కెల్డిష్ / ఇమేజింగ్ షాక్
యంగ్ రోజ్ మొహాన్ని ఓల్డ్ రోజ్‌గా మార్ఫ్ చేస్తాం. 101 సంవత్సరాల బామ్మ. కళ్లు మాత్రమే మారవు. మిగిలిన మొహం అంతా మారుతుంది.
ముసలి రోజ్ : అది గుర్తు చేసుకుంటే నా హృదయం ఎప్పుడూ కకావికం అవుతూనే ఉంటుంది. నా జీవితంలో నేను ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అది.
కట్ టూ రివర్స్ - ఆమె చుట్టూ మిగిలిన వాళ్లు అర్థవృత్తాకారంలో నిలబడి ఉంటారు. ఆమె చెప్పేది వినడంలో నిమగ్నమవుతారు. ఫ్రోజెన్ సైలెన్స్.
జాక్, రోజ్‌ల కథ పూర్తిగా వారు తెలుసుకున్నారు.
బోడైన్ : ఆ తర్వాత ఏమైంది?
ఓల్డ్ రోజ్ : (నవ్వుతూ) యు మీన్.. మేం ‘అది’ చేశామనేనా?

కట్ టు :
107 - ఇంటీరియర్ - రోజ్ అండ్ కాల్స్ సూట్ - నైట్
(బ్యాక్ టు 1912) జాక్ డ్రాయింగ్ మీద సంతకం చేస్తున్నాడు. రోజ్ తన దుస్తులు తిరిగి వేసుకుంటుంది.
Titanic_1 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఓల్డ్ రోజ్ (వాయిస్ ఓవర్) : మిమ్మల్ని డిస్‌అపాయింట్ చేసినందుకు సారీ బోడైన్. రోజ్ డ్రాయింగ్‌ని పరిశీలనగా చూసింది. దాని మీద తేదీ వెయ్ జాక్. ఈ రాత్రిని నేను జీవితంలో మర్చిపోకూడదు అనుకుంటున్నాను.
ఏప్రిల్ 14, 1912 జాక్ తేదీ వేశాడు.
(జేమ్స్ కామెరూన్ ‘టైటానిక్’ సినిమాలోనిది ఈ బ్యూటీఫుల్, రొమాంటిక్ సీన్)

ఎక్స్‌టీరియర్ - రెయిన్ ఫారెస్ట్ - నైట్ ఎఫెక్ట్
కెమెరా జేక్ పాదాల వెంట రన్ అవుతుంది. జేక్ నెయితిరితో పాటు నడుస్తుంటాడు. ఆ దారిలో జేక్ ప్రతి ఆకునీ, పుష్పాన్నీ ముట్టుకుంటున్నాడు. అవి జీవ ప్రకాశంతో కదలడం అతనికి ఆశ్చర్యం కలిగిస్తుంది. జేక్ కిందికి చూశాడు. వారొక పర్పుల్ కలర్‌లో ఉన్న పొద మీది నుంచి వెళ్తుంటారు. వారి పాద స్పర్శకు ఆ పొద ఆకులు స్పందిస్తుంటాయి. వారి పాదం తాకిన ప్రతిచోటా ఆకుపచ్చని వలయ కాంతి ఏర్పడుతుంది. ఆ కాంతి రేఖలు నీటిలో రాయి పడ్డప్పుడు అలల్లా కదులుతుంటాయి. కలలోనూ నిజంకాని అద్భుత దృశ్య సౌందర్యమది.
వైడ్ షాట్ తీసుకుంటే.. వారొక పెద్ద కొమ్మ మీది నుంచి నడుస్తుంటారు. పక్కన పెద్ద జలపాతం. అద్దంలాంటి నీటిలో వారి ప్రతిబింబాలు కనిపిస్తుంటాయి. జేక్ ఒక పెద్ద కొమ్మమీద నడుస్తున్న నెయితిరిని అనుసరిస్తుంటాడు.

కొందరు నావీ రైడర్స్ డైర్‌హ్సాస్ (వింత గుర్రాలు) మీద అటుగా వస్తారు. ఆ గుర్రాలకు ఆరు కాళ్లుంటాయి. లోహం లాంటి చర్మం, ఆంటినా లాంటి కొమ్ములుంటాయి వాటికి. ఆ ‘నావీకుల’ తోకలు గుర్రాలకు కలిపి ఉంటాయి. గుర్రాలను అదుపు చేసేందుకు అదో నరాల లింక్ అన్నమాట. ఆ ‘నావీకుల’ చేతిలో ఆయుధాలున్నాయి. వారు ఈటలు, బాణాలు జేక్‌కేసి గురిపెట్టారు. కానీ..
నెయితిరీ జేక్‌కు అడ్డంగా నిలబడుతుంది. ఆ దళం నాయకుడి వైపు కోపంగా చూస్తూ.. నావీ బాషలో గట్టిగా అరుస్తుంది.
నెయితిరి : (సబ్ టైటిల్) సుటే! ఏం చేస్తున్నావు? ఇతను నా నిర్బంధంలో ఉన్నాడు.
(సుటే ఆజానుబావుడు. బలవంతుడు. విగ్రహంలాంటి రూపం అతనిది. )
సుటే : (సబ్ టైటిల్) ఈ దుండగులు ఇక్కడ నిషిద్దులు. వీడ్ని చంపి నేను వాళ్లకి గుణపాఠం నేర్పుతాను.
నెయితిరి : (సబ్ టైటిల్) ఆగు. అది మీ పని కాదు. మన నాయకుడి దగ్గరికి నేనే తీసుకొస్తాను.
సుటే : (సబ్ టైటిల్) తీసుకురా.
ఎక్స్‌టీరియర్ - హోమ్‌ట్రీ - నైట్ ఎఫెక్ట్
జేక్‌ని నెయితిరి ఉండే గ్రామంవైపు లాక్కెళ్తుంటారు. ఆ గ్రామం పే.. ద్ద చెట్టు మీద ఉంటుంది. ఆ ‘హోమ్‌ట్రీ’ 250 మీటర్లు ఎత్తు ఉంటుంది. దాని మొదలు ‘సెకోయియా’ కంటే నాలుగుట్ల డయామీటర్లు ఎక్కువగా ఉంటుంది.

ఇంటీరియర్ - కామన్ ప్లేస్ / హోమ్‌ట్రీ - నైట్ ఎఫెక్ట్
Titanic tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఓపెన్ సెంట్రల్ ఏరియా.. ఆ గ్రామస్తులంతా జేక్ చుట్టూ చేరతారు. ఆ గిరిజనుల్లో మనం ఆడవాళ్లని, పిల్లల్ని ఎత్తుకున్న తల్లుల్ని.. ముసలివాళ్లని.. యువకుల్ని.. చూడొచ్చు.
(ఇవి ‘అవతార్’ సినిమాలోని సన్నివేశాలు)

ఇవి చదువుతుంటే మీకు కళ్లకు కట్టినట్లు దృశ్యాలు కనిపించే ఉంటాయి. దటీజ్ స్క్రీన్‌ప్లే. పై రెండూ జేమ్స్ కామెరూన్ రాసుకున్న ఒరిజినల్ స్క్రిప్టులు. ఇంటర్‌నెట్‌లో వెతికితే ఇలాంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాల ఒరిజినల్ స్క్రీన్‌ప్లేలు చాలా దొరుకుతాయి. అదీ ఉచితంగా.

బాలీవుడ్ బాత్
మీ ఫేవట్ మూవీకి సంబంధించిన పూర్తి విషయాలు, వివరాలు తెలుసుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? హాలీవుడ్ మూవీస్ అయితే ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. మేకింగ్ ఆఫ్ ద మూవీ.. వీడియోలు కూడా యూట్యూబ్‌లో కుప్పలు కుప్పలుగా ఉంటాయి. బట్ వాట్ ఎబౌట్ బాలీవుడ్? అంటే.. ఈ ట్రెండ్ బాలీవుడ్‌లో ఈ మధ్యే మొదలైంది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీస్‌ని ఇప్పుడు పుస్తక రూపంలోకి తీసుకొస్తున్నారు. వాటిల్లో పాపులర్ డైలాగులు, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఇంకా.. చాలా విషయాలు పొందుపరుస్తున్నారు.

గుర్తున్నాయా?
పియా గుర్తుందా? కరీనా కపూర్! వాక్యూమ్ క్లీనర్. ఇంజనీర్డ్ డెలివరీ. ఎవరు మర్చిపోతారు... 3 ఇడియట్స్ సినిమాని. ఇప్పుడు ఆ సినిమా ఒరిజినల్ స్క్రీన్‌ప్లే పుస్తక రూపంలో వచ్చింది. రాజు హిరానీ, అభిజిత్ జోషీ, ప్రొడ్యూసర్ విధూ వినోద్ చోప్రా, హీరో అమీర్‌ఖాన్ చేసిన ఈ ప్రయత్నం పెద్ద హిట్ అయ్యింది. ఇట్స్ మ్యాడ్‌నెస్. నీడ్‌పూస్ టూ సే.. ఆ పుస్తకాన్ని ముద్రించిన ఓమ్ బుక్స్ చీప్ ఎడిటర్ దీపా చౌదరీ ఏం చెప్పిందో తెలుసా?- ‘‘ఆ పుస్తకం మొదటి ముద్రణలన్నీ హాట్ హాట్‌గా అమ్ముడుపోయాయి. రీప్రింట్ కూడా చేశాం. ఆ తర్వాత కూడా ఆరు వేల కాపీలు అమ్ముడుపోయాయి’’ అదీ మ్యాటర్. బాలీవుడ్‌లో హిట్ అయిన సినిమాల్ని పుస్తక రూపంలో తేవడం ఇప్పుడొక హాట్ ట్రెండ్.

డాక్యుమెం
‘3 ఇడియట్స్ - ద ఒరిజినల్ స్క్రీన్‌ప్లే’ ఒక ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. ఆ పుస్తకం విడుదల సందర్భంగా ప్రొడ్యూసర్, డైరెక్టర్ వినోద్ చోప్రా ‘‘స్క్రీన్‌ప్లేలు కేవలం సినిమాని అర్థం చేసుకోవడానికి చదివేవి మాత్రమే కాదు. స్క్రీన్‌ప్లేలు చదవడమంటే ఒక ఎంజాయ్‌మెంట్’’ అన్నారు. ఇది అక్షరాలా నిజం. ఇండియన్ సినిమా చరివూతలో స్క్రీన్‌ప్లేలు, డైలాగ్ బుక్స్ ముద్రించడం ఒక గొప్ప పరిణామం. ఎందుకంటే వాటిలో కేవలం కథ. కథనాలే కాకుండా.. నటీనటుల ఇంటర్వ్యూలు, అనుభవాలు.. సినిమా మేకింగ్ కామెంటరీ.. ఎదురైన సమస్యలు.. అధిగమించిన విధానం.. వీటన్నింటినీ పొందుపరుస్తున్నారు. ఈ డాక్యుమెం అంతా చదవడం.. నిజంగా ఎంజామ్‌మెంటే.
బీరెడ్డి నగేష్‌రెడ్డి

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

కొన్ని షాపుల పేర్లు బావుంటాయి... మరికొన్నింటి పేర్లు......

  కొన్ని షాపుల పేర్లు బావుంటాయి... మరికొన్నింటి పేర్లు మస్త్ ఉంటాయి... ఇంకొన్నింటి పేర్లు క్రియేటివ్‌గా ఉంటాయి...క్రియేటివిటీలో ఫీల్ ఉంటుంది...అర్థం చేసుకుంటే షాపు బోర్డులోనూ ఫిలాసఫీ ఉంటుంది. అలాంటి పేర్ల మిక్చర్ పొట్లాం.. ఈ మోర్ దాన్ మోర్. I wandered lonely as a cloud That floats on high oer vales and hills, When all at once I saw a crowd, A host, of golden daffodils; (నేను ఒంటరిగా ఒక మేఘంలా తిరిగాను. లోయలు, గుట్టల మీదుగా. అప్పుడు నేనొక సమూహాన్ని చూశాను. అందమైన గోల్డెన్ డాఫొడిల్స్ పువ్వులు అవి) విలియమ్ వర్డ్‌స్మిత్ రాసిన ‘ద డాఫొడిల్స్’ పోయమ్‌లోని మొదటి భాగమిది. ఇంటర్మీడియట్‌లో బట్టీపట్టినట్లు గుర్తు. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి యూసుఫ్‌గూడ వెళ్తుంటే వెంకటగిరిలో డాఫోడిల్స్ పేరుతో ఫ్యామిలీ సెలూన్ కనిపిస్తుంది. డాఫొడిల్స్ అంటే మెట్ట తామర పువ్వులు అని అర్థం. పసుపు రంగులో అందంగా ఉంటాయవి. వర్డ్‌స్మిత్‌ని తన్మయ పరిచిన ఆ పువ్వులు సెలూన్ నిర్వాహకులనూ కదిలించి ఉంటాయి. అందుకే డిఫంట్‌గా ఉండాలని ఆ పేరు పెట్టారేమో. చూసే మనసు.. వెతికే కళ్లు ఉండాలిగానీ.. అలాంటి విభిన్నమైన ...