Skip to main content

హైదరాబాదీ.. దీపిక పదుకొనె.. అనురాధ ఎస్. నాయక్


water-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaలవ్ ఆజ్ కల్ సినిమా గుర్తుందా? అందులో ‘జై’ ఒక ఆర్కిటెక్ట్...
గోల్డెన్ గేట్ కోసం పనిచేయాలనుకుంటాడు...‘మీరా’ రిస్టోరేషన్ ఆర్కిటెక్ట్...
ఇండియాలో ెసెటిలవ్వాలని ఆమె డ్రీమ్. ఇక్కడ విషయం... సినిమా స్టోరీ కాదు.
రిస్టోరేషన్ గురించి... దీపికా డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి....అలాంటి థీమే ఈ అనురాధా నాయక్‌ది.‘లవ్ ఆజ్ కల్’ సినిమా సమయంలో దీపికా పదుకొన్ తాజ్‌మహల్‌ని చూడడానికి మూడుసార్లు వెళ్లిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ సినిమాలో ఆర్కిటెక్ట్‌గా పనిచేయడం వల్ల చారివూతాత్మక నిర్మాణాల పట్ల ఆమెకు ఆసక్తి పెరిగిందట. ఆమెకే కాదు... అలాంటి నిర్మాణాలంటే ఎవరికైనా ఆసక్తే ఉంటుంది. అలాంటి కట్టడాలను మనం ఇప్పుడు చూస్తున్నాం..కానీ మన ముందుతరాల వారు చూడగలరా? అప్పటి వరకు అవి కూలిపోకుండా ఉంటాయా? అంటే.. కచ్చితంగా ఉంటాయి. ఉండేలా చేయొచ్చు. అలా పురాతన కట్టడాలను పునరుద్ధరించడాన్నే రిస్టోరేషన్ అంటారు. దేశవిదేశాల్లో చదివి.. సినిమాలో దీపికలా.. ఇండియాలో పురాతన భవనాలను పునరుద్ధరించేందుకు వచ్చింది అనురాధ ఎస్. నాయక్. ఆమె మన హైదరాబాద్ ‘ఆడబిడ్డ’.

104 ఏళ్ల ఇల్లు...
అనురాధ గురించి తెలుసుకునే ముందు ఆమె ఫ్లాష్‌బ్యాక్ కూడా కొంత చదవాల్సిందే. హైదరాబాద్ మొజంజాహీ మార్కెట్ దగ్గరలో ధర్మవీర్ వామన్ నాయక్ మార్గ్ ఉంది. 1907లో వివేకవర్ధినీ పాఠశాలని ఆయన స్థాపించారు. ఆయన వారసుడు, ప్రస్తుతం పాఠశాల ప్రెసిడెంట్‌గా ఉన్న సుధీర్ ఆర్. నాయక్ కూతురే అనురాధా నాయక్. గౌలీగూడ రామమందిరం పక్కన ఒక పురాతన భవనం ఉంటుంది. 104 సంవత్సరాల క్రితం కట్టిన ఆ ప్యాలెస్‌లాంటి ఇంట్లోనే వీళ్లిప్పుడు నివసిస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్‌లోనే ఆ ఫ్లేవర్ ఉంది. అందుకేనేమో ఆమె రిస్టోరేషన్ ఆర్కిటెక్ట్ అయింది.

విదేశీ ‘పునాది’
aunu-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఅనురాధ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అయినా చదివింది మాత్రం విదేశాల్లో. హైదరాబాద్‌లో స్కూలింగ్ పూర్తయిన తర్వాత 2004లో ఎడిన్‌బర్గ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లో బ్యాచిలర్ ఇన్ ఆర్కిటెక్చర్ విత్ కమాండేషన్ పూర్తిచేసింది. 2005లో అదే కాలేజ్ నుంచి మాస్టర్ డిగ్రీ పట్టా తీసుకుంది. ఫోటోక్షిగఫీలో ప్రత్యేక కోర్సు కూడా పూర్తి చేసింది. ఆల్ ఇండియా కామ్లిన్ డ్రాయింగ్ కాంపిటీషన్‌లో గోల్డ్ మెడల్‌ని కూడా సాధించింది. 2007లో ఎస్‌పిఎబి (పురాతన భవనాల సాంఘిక సంరక్షణ) రిపేరింగ్‌లో స్పెషల్ కోర్సు లండన్‌లో చదివింది. 2009లో ద బార్ట్‌పూట్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో ఆర్కిటెక్చర్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెషనల్‌గా ప్రాక్టీస్ చేసింది.

లోకల్ ‘బిల్డప్’
హైదరాబాద్‌లోని చరివూతాత్మక నిర్మాణం చౌమహల్లా ప్యాలెస్ పునరుద్ధరణలో అనురాధ కీలకపాత్ర పోషించింది. యుకెకి చెందిన ఇన్‌టాచ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్యాలెస్‌ని రిస్టోరేషన్ చేసిన టీమ్‌లో ఆమె ఒక మెంబర్. ఇందుకుగాను ఆమెకు యునెస్కో ఏసియా పసిఫిక్ అవార్డ్ లభించింది. మూతబడిన ప్యాలెస్‌ని సందర్శకుల కోసం తిరిగి తెరిచేందుకు చౌమహల్లా ప్యాలెస్‌ని పునరుద్ధరించారు. ఇందులో ఎగ్జిబిషన్ కోసం హాల్స్‌ని, గ్యాలరీలని ఒరిజినల్ ప్లేవర్స్ మిస్ అవ్వకుండా ఆధునీకరించారు. రూమ్స్ లేఅవుట్, లైటింగ్, స్టక్కో ప్యాటర్న్‌లో ఉన్న సీలింగ్, ఫర్నీచర్‌లను తీర్చిదిద్దారు. 2006లో సంవత్సరం పాటు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసింది అనురాధ. 2009లో ఈ ప్యాలెస్ టెక్స్‌టైల్స్ కలెక్షన్ హాల్(అఫ్తబ్ మహల్) కోసం కూడా ఆమె పనిచేసింది. నిజాం సిల్వర్ జూబ్లీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పురానా హవేలీలోని సిటీ మ్యూజియం రిస్టోరేషన్‌లో కూడా ఆమె కృషి చేసింది.

అనుభవాల ‘నిర్మాణం’
kujaa-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఅనురాధా నాయక్ హైదరాబాద్‌లోనే కాక విదేశాల్లో కూడా రిస్టోరేషన్ ప్రాజెక్ట్‌లను డీల్ చేసింది. క్యాటర్‌బరీలోని ప్యూర్‌సెల్ మిల్లర్ ఎల్‌ఎల్‌పి కంపెనీకోసం ఆమె పనిచేసింది. 14 నగరాల్లో ఆ సంస్థ కార్యాలయాలున్నాయి. ఆ నగరాల్లోని పురాతన కట్టడాలకు ఆ సంస్థ భద్రత కల్పిస్తుంటుంది. ఈ కంపెనీతో పనిచేసినప్పుడు డిజైనింగ్, ప్లానింగ్, కాంట్రాక్ట్ అడ్మిషన్, రిపోర్ట్స్, స్టేట్‌మెంట్స్, ప్లాన్‌లలో ఎంతో అనుభవాన్ని సంపాదించింది. ఇందులో భాగంగానే బ్రిటీష్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్‌ని ఆమె రిస్టోరేషన్ చేసింది. మన హైదరాబాదీ ఇలాంటి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లను డీల్ చేసిందంటే గర్వించదగ్గ విషయమే.

ప్లాస్టరింగ్
జూలై 2011 నుంచి నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ గడిని రిస్టోరేషన్ చేస్తోంది అనురాధా నాయక్. అప్పట్లో రామ్‌చరణ్ తేజ్ పెళ్లి కోసం ఈ గడిని సిద్ధం చేస్తున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి కూడా. కామినేని కుటుంబానికి చెందిన ఈ గడి 30 ఎకరాల్లో ఉంటుంది. దీన్ని దాదాపు 300 సంవత్సరాల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనిలోనే బిజీగా ఉంది అనురాధ. ఇదే ఏడాది మార్చిలో జైసల్మేర్ మహారాణీ రాజేశ్వరీ సింగ్ అనురాధని ప్రత్యేకంగా ఆహ్వానించింది. జైసల్మేర్ కోటలోని ప్యాలెస్ మ్యూజియాన్ని పునరుద్ధరించేందుకు ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంది. దోమకొండ గడి పని పూర్తయ్యాక జైసల్మేర్ వెళ్లే ఆలోచనలో ఉంది ఆమె.

ఫినిషింగ్
bulding-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaపెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం పనిచేసిన తర్వాత అనురాధా నాయక్ తిరిగి హైదరాబాద్‌కి వచ్చేసింది. హైదరాబాద్‌కు ఉన్న చరిత్ర, చారివూతాత్మక సంపద ఆమెని ఇక్కడే కట్టిపడేశాయి. తన ప్రతిభ, స్టాండర్డ్ వ్యాల్యూస్ ఇప్పుడు నగరం కోసం, మనదేశం కోసం వినియోగించాలనుకుంటోంది. హైదరాబాద్ చరివూతని, నిర్మాణాలను పూర్తి స్థాయిలో అర్థం చేసుకునేందుకు పరిశోధనలు చేస్తోంది. ‘‘1853-1883 వరకు నిజాం నవాబు దగ్గర ప్రధానిగా పనిచేసిన మొదటి సాలార్జంగ్ కుతుబ్‌షాహీ టూంబ్స్‌ని అప్పట్లోనే పునరుద్ధరించాడు. అంటే రిస్టోరేషన్ మనకు కొత్త కాదు. మన నగరంలోనే కాదు, మన దేశంలో కూడా చాలా చారివూతాత్మక ప్రదేశాలున్నాయి. ఆ సంపద, సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. అందుకోసం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు దీనిపట్ల అవగాహన కలిగించాలి. ఈ అంశంపై చదువుకున్న వారికి మనదేశంలో, విదేశాల్లో మంచి అవకాశాలున్నాయి. అందుకే ఈ రంగంలోకి రావాలనుకుంటున్న వారు హ్యాపీగా రావొచ్చు’’ అని చెప్పింది అనురాధా నాయక్.

అకడమిక్ అవార్డ్స్
Dress-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema-2005 నుంచి ఎడిన్‌బర్గ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ కలెక్షన్ కమిటీ మెంబర్‌గా ఉంటోంది.
-2005లో కొలంబియా యూనివర్సిటీ సొసైటీ ఆఫ్ ఆర్కిటెక్చరల్ హిస్టారియన్స్ జర్నల్‌లో ఆమె గురించి ప్రచురితమైంది.
-2007లో అదే యూనివర్సిటీ నుంచి స్కాట్ ఓప్లర్ ఫెలోషిప్ అవార్డ్‌ని కూడా అందుకుంది.
- 2009లో రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రిటీష్ ఆర్కిటెక్ట్స్ చార్టెడ్ మెంబర్‌గా ఎన్నికయ్యింది. రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్‌లో కూడా ఫెలోషిప్ ఉంది.

పరిశోధనలు
ద లాస్ట్ ఆల్కెమీ : మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ కోసం ఇండియా, స్కాట్‌లాండ్ మ్యూజియాలకు సంబంధించిన సమకాలీన సిద్ధాంత వ్యాసం.
ద డిజైన్ ఆఫ్ ది ఎడిన్‌బర్గ్ : పోస్ట్‌క్షిగాడ్యుయేషన్ కోసం ఇడెన్‌బర్గ్ కాలేజ్, కలెక్షన్స్ మీద సిద్ధాంత వ్యాసం.

ప్రచురణలు
ద హల్నైషన్ ఆఫ్ ఎడిన్‌బర్గ్

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

కొన్ని షాపుల పేర్లు బావుంటాయి... మరికొన్నింటి పేర్లు......

  కొన్ని షాపుల పేర్లు బావుంటాయి... మరికొన్నింటి పేర్లు మస్త్ ఉంటాయి... ఇంకొన్నింటి పేర్లు క్రియేటివ్‌గా ఉంటాయి...క్రియేటివిటీలో ఫీల్ ఉంటుంది...అర్థం చేసుకుంటే షాపు బోర్డులోనూ ఫిలాసఫీ ఉంటుంది. అలాంటి పేర్ల మిక్చర్ పొట్లాం.. ఈ మోర్ దాన్ మోర్. I wandered lonely as a cloud That floats on high oer vales and hills, When all at once I saw a crowd, A host, of golden daffodils; (నేను ఒంటరిగా ఒక మేఘంలా తిరిగాను. లోయలు, గుట్టల మీదుగా. అప్పుడు నేనొక సమూహాన్ని చూశాను. అందమైన గోల్డెన్ డాఫొడిల్స్ పువ్వులు అవి) విలియమ్ వర్డ్‌స్మిత్ రాసిన ‘ద డాఫొడిల్స్’ పోయమ్‌లోని మొదటి భాగమిది. ఇంటర్మీడియట్‌లో బట్టీపట్టినట్లు గుర్తు. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి యూసుఫ్‌గూడ వెళ్తుంటే వెంకటగిరిలో డాఫోడిల్స్ పేరుతో ఫ్యామిలీ సెలూన్ కనిపిస్తుంది. డాఫొడిల్స్ అంటే మెట్ట తామర పువ్వులు అని అర్థం. పసుపు రంగులో అందంగా ఉంటాయవి. వర్డ్‌స్మిత్‌ని తన్మయ పరిచిన ఆ పువ్వులు సెలూన్ నిర్వాహకులనూ కదిలించి ఉంటాయి. అందుకే డిఫంట్‌గా ఉండాలని ఆ పేరు పెట్టారేమో. చూసే మనసు.. వెతికే కళ్లు ఉండాలిగానీ.. అలాంటి విభిన్నమైన ...