Skip to main content

శ్రీరామనవమి శుభాకాంక్షలు... రామాలయం బ్లాగు ప్రారంభం..


శ్రీరామనవమి పర్వదినాన.. రామాలయం బ్లాగు ప్రారంభమైంది. నల్గొండ పట్టణంలోని రామగిరిలో ఉన్న రామాలయం రెండో భద్రాద్రిగా పేరుగాంచింది. దీనికి చాలా చరిత్ర ఉంది. దాదాపు 300 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారు. మొదట ఈ దేవాలయం పట్టణంలోని మాల్‌బౌళి సమీపంలో ఉండేది. కొంతకాలం అనంతరం ఈ ప్రాంతంలో అనాచారాలు, దుష్కర్మలు జరగడంతో శ్రీ స్వామి వారు శ్రీ కంభంమెట్టు శేషాచార్యుల అన్నదమ్ములకు కలలో కనిపించి నన్ను వేరే ఎక్కడైనా ప్రతిష్టించాలని కోరుకున్నారనే ప్రచారం ఉంది. దీంతో ఒక మంచి ముహుర్తం చూసుకుని నల్గొండ సమీపంలోని పానగల్లు గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో గరుడ పక్షి వచ్చి శకునంగా వాలి భూమికి ముక్కు తుడిచి వెళ్లిందని, అప్పుడు వారు ఈ పక్షి దష్టాంతరం తెలుసుకునేందుకు కొందరు వ్యక్తులను తీసుకెళ్లి గడ్డపారలతో తవ్వగా ఆ ప్రదేశంలో ప్రస్తుతం ఉన్న దేవాలయానికి కావాల్సిన రాయి, తదితర వస్తువులు దొరకడంతో సుమారు 200 సంవత్సరాల క్రితం దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయంలో శ్రీ సీతారామ, లక్ష్మణ, భరత, శతృఘ్న, హన్మంత సమేతంగా ప్రతిష్టంచడంతో ఈ ప్రాంతానికి రామగిరి అనే నామకరణం చేశారు.
మొదట్లో ఈ దేవాలయంలో గర్భగుడి మాత్రమే ఉండగా ప్రస్తుతం ఆండాళ్ దేవత, సీతారాముల విగ్రహాలు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయస్వామి విగ్రహాలు, రాజగోపురం, కళ్యాణమండపాలతో యజ్ఞశాతలతో దేవాలయం ప్రస్తుతం నిత్య పూజలతో భక్తుల మధ్య విరాజిల్లుతున్నది. 1956 పూర్వం దేవాలయం అసంపూర్తిగా ఉండడంతో ఆనాటి డిప్యూటి కలెక్టర్ కన్నయ్య భార్య శ్రీమతి రిందాదేవి నిర్మాణం చేయించారు. రిందాదేవికి అండాళమ్మ కలలో ప్రత్యక్షమై దేవాలయం నిర్మించమని కోరగా అండాళమ్మ దేవి విగ్రహాన్ని ప్రతిష్టంచారు. ఈ ఆలయం గురించి అనేక కథలు ప్రచారంలో ఉండగా మొదట ఈ దేవాలయంలో కంభమెట్లు అనంతాచార్యులు, శేషాచార్యులు గర్భగుడిని నిర్మించినట్లు పూర్వికులు చెబుతున్నారు.

దీనికి సంబంధించిన బ్లాగుని.. ఏప్రిల్ 1న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఇందులో రామాలయానికి సంబంధించి రకరకాల ఫోటోలు.. గోదా కల్యాణం ఫోటోలు.. వీడియోలు ఉన్నాయి. మీరూ ఈ బ్లాగ్‌ని దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Comments

durgeswara said…
రామచంద్రప్రభువుల కృపాకటాక్షాలు మీపై సదా వర్షించాలని ప్రార్ధిస్తున్నాను

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

ప్రేమే కదా(కాదు) జీవితం

ప్రేమే కదా జీవితం అంటారు కొందరు. ప్రేమే కాదు జీవితం అంటారు ఇంకొందరు. ఈ రెండూ భిన్న ధృవాలు. రైలు పట్టాలు. ఎప్పుడూ కలవవు. కానీ అవి అతని జీవితంలో కలిశాయి. అదే విధి ఆడిన వింత నాటకం. పది మందీ నేర్పలేని గుణపాఠం. మాదో చిన్న పల్లెటూరు. వందల్లో ఇల్లు. మందల్లా మనుషులు. ఎవరి పోకడ వారిది. చీమ కదిలినా గుసగుస. అమ్మాయిలతో మాట్లాడటం... అదో పెద్ద తప్పు. నా స్నేహితుని పేరు వెంకట్‌. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలని వాడిదో కోరిక. కానీ ఏ అమ్మాయీ నచ్చేది కాదు. వెంకట్‌ హైదరాబాద్‌లో జాబ్‌ చేస్తుండేవాడు. చాలా రోజుల తర్వాత సంక్రాతికి ఊరొచ్చాడు. మా ఊళ్లో సంక్రాంతి క్రీడోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అప్పుడు ఊరంతా అక్కడే. కబడ్డీ ఫైనల్స్‌. అందరి కళ్లూ వారిపైనే. కానీ వెంకట్‌ కళ్లు మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నాయి. అప్పుడు కనిపించింది ఓ అమ్మాయి లంగా ఓణీలో. సినిమాల్లో తప్ప ఓణీలో అమ్మాయిని చూసి చాలా రోజులైందట. అలానే చూస్తుండి పోయాడు. సడన్‌గా ఆ అమ్మాయి వెంకట్‌ వైపు చూసింది. ఆమె చూపుల్లో కోపం. అతని చూపుల నుండి తప్పించుకోవాలని ఆమె అటూ ఇటూ తిరగసాగింది. కానీ వెంకట్‌ చూపులు ఆమె వెంటే పరుగెత్తాయి. ఎవరా అమ్మాయి? ఆరా...

మరిచిపోలేని బహుమతి

నేను అప్పుడు ఏడో తరగతి చదువుతున్నా. ఓ మోస్తారుగానే చదివేవాడిని. ఒక రోజు లెక్కల మాష్టారు నారాయణగారు పాఠం చెబుతున్నారు. ఒక లెక్క ఉదాహరణగా చెప్పి రెండో లెక్క మాతో చేయించేవారు ఆయన. అలా ఒకరోజు ఎవరు త్వరగా చేస్తే వాళ్లకు ఒక బహుమతి ఇస్తానన్నారు. నేను టకటకా మొదలెట్టా. నాకంటే బాగా లెక్కలు చేసేవారు మాత్రం "మాష్టారూ! ఏం గిఫ్ట్‌ ఇస్తారు? ఇప్పుడే ఇస్తారా తర్వాత ఇస్తారా?'' ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. నేను ముందుగా చేసి చూపించా. ఆయన వెంటనే తన జేబులోంచి పెన్ను తీసి నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ పెన్ను కొన్ని సంవత్సరాల పాటు పోగొట్టకుండా కాపాడుకున్నా. నేను ఇంటర్‌ చదివేప్పుడు మా క్లాసులో స్వప్న అని ఒక ఫ్రెండ్‌ ఉండేది. ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే క్లాస్‌లో వాణి మేడమ్‌ సమక్షంలో ఘనంగా జరుపుకునే వారం. మా క్లాసులో చాలా తక్కువ మందే ఉండేవారు. అలా ఒకరోజు నా పుట్టినరోజు వచ్చింది. క్లాస్‌లోనే కేక్‌ కట్‌ చేయించారు. ఒకరి పుట్టిన రోజు వస్తుందంటే ఎలాగూ రెండు మూడు రోజుల నుంచి చర్చలు జరుగుతాయి. కాబట్టి అందరూ గిఫ్ట్‌లు తీసుకుని వచ్చారు. కానీ స్వప్న మాత్రం నాకు ఎలాంటి బహుమతి ఇవ్వలేదు. (అంటే బహుమతి కోసమే పుట్టిన రోజు...