Skip to main content

లెట్స్ ప్లే Most Anticipated Video Games of 2012

ఊహించని మలుపులు.. ఊహకందని ఎత్తులు.. 
అదో లోకం... 
అక్కడ మీరే హీరో 
గెలిస్తేనే! లేదంటే జీరో అవుతారు. 
ప్రపంచం ఆశగా ఎదురుచూసిన.. 
చూస్తున్న కొన్ని వీడియో గేమ్స్ గురించే ఈ బైట్స్.
ఫైనల్ ఫాంటసీ - XIII-2
స్వేర్ ఎనిక్స్ కంపెనీ రూపొందించిన ఫైనల్ ఫాంటసీ వీడియో గేమ్ పోయిన సంవత్సరం పెద్ద హిట్ అయింది. దీన్ని మరింత మెరుగు పరిచి ఇప్పుడు సీక్వెల్‌ని విడుదల చేసింది ఆ కంపెనీ. ప్లే స్టేషన్ 3, ఎక్స్‌బాక్స్360 ప్లాట్‌ఫామ్స్ మీద ఈ గేమ్‌ని సింగిల్ ప్లేయర్ ఆడొచ్చు.

కినెక్ట్ స్టార్ వార్స్
స్టార్ వార్స్ ఇష్టపడని వీడియో గేమ్ లవర్స్ ఉంటారా? కదా.. అలాంటి వారికి ఇది మరింత కిక్కిచ్చే గేమ్. పిల్లలకు ఎక్కువ థ్రిల్‌ని కలిగించే ఈ గేమ్‌ని టెర్మినల్ రియాలిటీ కంపెనీ డిజైన్ చేసింది. దీన్ని ఎక్స్‌బాక్స్ 360 ప్లాట్‌ఫామ్ మీది ఆడొచ్చు. 

మాస్ ఎఫెక్ట్ 3
మస్త్ మజానిచ్చే పక్కా యాక్షన్ రోల్ ప్లేయింగ్ గేమ్ ఇది. బయోవేర్ అనే కంపెనీ డెవలప్ చేసింది. దీన్ని ప్లేస్టేషన్ 3, ఎక్స్‌బాక్స్360 ప్లాట్‌ఫామ్స్‌తో పాటు మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్ మీద కూడా ఆడొచ్చు. సింగిల్ ప్లేయర్, మల్టీ ప్లేయర్లు ఆడొచ్చు. 

మ్యాక్స్ పేన్ 3
ఈ గేమ్ ఇంకా విడుదల కాలేదు. రాక్‌స్టార్ గేమ్స్ కంపెనీ దీన్ని రూపొందిస్తోంది. మైక్రోసాఫ్ట్ విండోస్, ప్లేస్టేషన్3, ఎక్స్‌బాక్స్ 360 ప్లాట్‌ఫామ్స్ మీద దీన్ని ఆడొచ్చు. చాలామంది గేమ్స్ లవర్స్ ఎదురుచూస్తున్న ఈ గేమ్ మే నెలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. 

ప్రెయ్ 2
ఈ గేమ్ కూడా ఇంకా విడుదల కాలేదు. ఫస్ట్ పర్సన్ షూటర్ వీడియో గేమ్ ఇది. హ్యుమన్ హెడ్ స్టూడియోస్ దీన్ని రూపొందిస్తోంది. దీన్ని కూడా విండోస్, పిఎస్3, ఎక్స్‌బాక్స్360 ప్లాట్‌ఫామ్స్ మీద ఆడొచ్చు. 2006లో విడుదలై చాలామందిని ఆకట్టుకున్న ప్రెయ్‌కి ఇది సీక్వెల్. 

రెకోనింగ్
కింగ్‌డమ్స్ ఆఫ్ అమలూర్ రెకోనింగ్ పేరుతో 3 స్టూడియోస్ కంపెనీ రూపొందించిన ఈ గేమ్ ఫిబ్రవరిలో విడుదలైంది. రోల్ ప్లేయింగ్ గేమ్స్‌లో ఇది కూడా ఒక సంచలనం. మూడు ప్లాట్‌ఫామ్స్ మీద ఆడొచ్చు. అద్భుతమైన యాక్షన్ సీన్స్ మీకు ఎదురవుతాయి. 

ద సీక్రెట్ వరల్డ్
ఇదో యాక్షన్ అడ్వేంచర్. మాసివ్ మల్టీ ప్లేయర్ ఆన్‌లైన్ రోల్ ప్లేయింగ్ గేమ్ ఇది. ఫన్‌కామ్ అనే కంపెనీ రూపొందిస్తోంది. మూడు రహస్యాల కోసం సాగే వేట అద్భుతంగా ఉంటుందట. జూన్ 19న విడుదల చేయనున్నట్లు ఫన్‌కామ్ కంపెనీ ప్రకటించింది. 

ఐ యామ్ అలైవ్
మాంచి హర్రర్ గేమ్. డార్క్‌వర్క్స్, యుబిసాఫ్ట్ షాంఘై కంపెనీ రూపొందించిన ఈ గేమ్ ఎక్స్‌బాక్స్ లైవ్ ఆర్కెడ్ ప్లాట్‌ఫామ్ వెర్షన్ విడుదలైంది. ప్లేస్టేషన్ నెట్‌వర్క్‌లకు సంబంధించి ఏప్రిల్‌లో విడుదల కానుంది. సో.. ఫిక్షన్ సిటీలోకి ఎంటర్ అయ్యేందుకు మీరు రెడీయా? 

డిషోనార్డ్
అద్భుతమైన గ్రాఫిక్ ప్రపంచంలోకి స్వాగతం. ఈ గేమ్ మీరు ఆడబోతున్నారంటే మీరో ఊహాలోకంలోకి అడుగుపెడుతున్నట్లే. అమేజింగ్ గ్రాఫిక్స్, వండరఫుల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఈ గేమ్ మీ సొంతం చేస్తుంది. ఇది ఈ సంవత్సరం సెకండాఫ్‌లో విడుదలకానుంది. 

ఓవర్‌ైస్ట్రెక్
నలుగురు ఆడే కోఆపరేటివ్ యాక్షన్ వీడియోగేమ్ ఇది. ఇన్‌సోమ్నిక్ గేమ్స్ కంపెనీ రూపొందిస్తోంది. ఈ వేసవి కాలంలో విడుదల కానుంది. సింగిల్ ప్లేయర్, మల్టీప్లేయర్, కోఆపరేటివ్.. ఇలా మూడు రకాలుగా ఈ ఆటని ఆడొచ్చు. 

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

ప్రేమే కదా(కాదు) జీవితం

ప్రేమే కదా జీవితం అంటారు కొందరు. ప్రేమే కాదు జీవితం అంటారు ఇంకొందరు. ఈ రెండూ భిన్న ధృవాలు. రైలు పట్టాలు. ఎప్పుడూ కలవవు. కానీ అవి అతని జీవితంలో కలిశాయి. అదే విధి ఆడిన వింత నాటకం. పది మందీ నేర్పలేని గుణపాఠం. మాదో చిన్న పల్లెటూరు. వందల్లో ఇల్లు. మందల్లా మనుషులు. ఎవరి పోకడ వారిది. చీమ కదిలినా గుసగుస. అమ్మాయిలతో మాట్లాడటం... అదో పెద్ద తప్పు. నా స్నేహితుని పేరు వెంకట్‌. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలని వాడిదో కోరిక. కానీ ఏ అమ్మాయీ నచ్చేది కాదు. వెంకట్‌ హైదరాబాద్‌లో జాబ్‌ చేస్తుండేవాడు. చాలా రోజుల తర్వాత సంక్రాతికి ఊరొచ్చాడు. మా ఊళ్లో సంక్రాంతి క్రీడోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అప్పుడు ఊరంతా అక్కడే. కబడ్డీ ఫైనల్స్‌. అందరి కళ్లూ వారిపైనే. కానీ వెంకట్‌ కళ్లు మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నాయి. అప్పుడు కనిపించింది ఓ అమ్మాయి లంగా ఓణీలో. సినిమాల్లో తప్ప ఓణీలో అమ్మాయిని చూసి చాలా రోజులైందట. అలానే చూస్తుండి పోయాడు. సడన్‌గా ఆ అమ్మాయి వెంకట్‌ వైపు చూసింది. ఆమె చూపుల్లో కోపం. అతని చూపుల నుండి తప్పించుకోవాలని ఆమె అటూ ఇటూ తిరగసాగింది. కానీ వెంకట్‌ చూపులు ఆమె వెంటే పరుగెత్తాయి. ఎవరా అమ్మాయి? ఆరా...

మరిచిపోలేని బహుమతి

నేను అప్పుడు ఏడో తరగతి చదువుతున్నా. ఓ మోస్తారుగానే చదివేవాడిని. ఒక రోజు లెక్కల మాష్టారు నారాయణగారు పాఠం చెబుతున్నారు. ఒక లెక్క ఉదాహరణగా చెప్పి రెండో లెక్క మాతో చేయించేవారు ఆయన. అలా ఒకరోజు ఎవరు త్వరగా చేస్తే వాళ్లకు ఒక బహుమతి ఇస్తానన్నారు. నేను టకటకా మొదలెట్టా. నాకంటే బాగా లెక్కలు చేసేవారు మాత్రం "మాష్టారూ! ఏం గిఫ్ట్‌ ఇస్తారు? ఇప్పుడే ఇస్తారా తర్వాత ఇస్తారా?'' ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. నేను ముందుగా చేసి చూపించా. ఆయన వెంటనే తన జేబులోంచి పెన్ను తీసి నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ పెన్ను కొన్ని సంవత్సరాల పాటు పోగొట్టకుండా కాపాడుకున్నా. నేను ఇంటర్‌ చదివేప్పుడు మా క్లాసులో స్వప్న అని ఒక ఫ్రెండ్‌ ఉండేది. ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే క్లాస్‌లో వాణి మేడమ్‌ సమక్షంలో ఘనంగా జరుపుకునే వారం. మా క్లాసులో చాలా తక్కువ మందే ఉండేవారు. అలా ఒకరోజు నా పుట్టినరోజు వచ్చింది. క్లాస్‌లోనే కేక్‌ కట్‌ చేయించారు. ఒకరి పుట్టిన రోజు వస్తుందంటే ఎలాగూ రెండు మూడు రోజుల నుంచి చర్చలు జరుగుతాయి. కాబట్టి అందరూ గిఫ్ట్‌లు తీసుకుని వచ్చారు. కానీ స్వప్న మాత్రం నాకు ఎలాంటి బహుమతి ఇవ్వలేదు. (అంటే బహుమతి కోసమే పుట్టిన రోజు...