Skip to main content

బడ్జెట్ టూర్...కలిసి వెళ్తే.. కలదు లాభం!!


 

The world is a book and those who do not travel read only one page.
- St. Augustine

(ఈ ప్రపంచం ఒక పుస్తకం. ప్రయాణం చేయని వారు ఒక పేజీ మాత్రమే చదవగలరు)
అందుకే.. వీలైనప్పుడల్లా ఏదో ఒక ప్రదేశాన్ని చూస్తుండాలి...
కుదిరినప్పుడల్లా ఒక టూర్‌కి వెళ్తుండాలి...
అందుకు ఈ వేసవి మంచి అవకాశం...
డబ్బులు ఖర్చవుతాయని బాధపడేవారి
కోసం ఒక ‘మీటప్’ ప్యాకేజీ ట్రెండ్ ఉంది...
కలిసి వెళ్తే.. కలదు లాభం!!

హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ ఫ్యామిలీ టూర్ వెళ్లాలనుకున్నారు. ఎంత ఖర్చవుతుంది? మీరు, మీ భార్యా పిల్లలతో కలిపి నలుగురైదుగురు అనుకుందాం. ఏసీ కారు అయితే ఎనిమిది గంటలకు పదిహేను వందల రూపాయలు.. వెళ్లి రావడానికి జర్నీ.. నాలుగు గంటలు.. అక్కడ ఉండేది నాలుగు గంటలు... సరిపోతుంది. కానీ ఒకవేళ లేటయితే కిలోమీటర్‌కి ఏడు రూపాయలు ఎక్స్‌ట్రా పే చేయాల్సిందే. లంచ్.. స్నాక్స్.. టికెట్లు.. బోటింగ్ ఖర్చు... మొత్తం కలిపి సింపుల్‌గా రెండు వేల రూపాయలు ఖర్చవుతుంది. మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో రెండు వేలంటే పెద్ద ఫిగరే. ఇదే బడ్జెట్‌లో నాలుగు ఫ్యామిలీలు అదే సాగర్‌కు వెళ్లొచ్చే బంపర్ ఆఫర్ ఉంది.

జస్ట్ ఫర్ ఛేంజ్
tour_1వేసవి సెలవులు రాగానే చాలామంది తమ పిల్లల్ని.. అమ్మమ్మ ఇంటికో నాయనమ్మ ఇంటికో పంపిస్తుంటారు. ఇప్పటికీ అలా పంపించేవారు ఉన్నా.. ఇది చాలా తగ్గిందనే చెప్పొచ్చు. ఇప్పటి కార్పొరేట్ చదువులతో పిల్లలు వేసవి సెలవుల్లో కూడా.. ప్రయివేటు క్లాసులంటూ.. సమ్మర్ క్యాంపులంటూ బిజీగానే ఉంటున్నారు. ఏదో వారం పది రోజులు సెలవులు దొరికితే పిల్లలతో సరదాగా జస్ట్ ఫర్ ఛేంజ్.. టూర్‌కి వెళ్లాలని పేరెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. కానీ ఫ్యామిలీ టూర్ అంటే మాటలు కాదు. ఎక్కడికి వెళ్లాలి? ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చవుతుంది? అంత డబ్బు అవసరమా? ఇలాంటి ప్రశ్నలు చాలానే వస్తాయి. పైన చెప్పిన నాగార్జున సాగర్.. ఒక ఉదాహరణ మాత్రమే. అదే గోవా.. ఊటీ... కొడైకెనాల్‌కయితే ఖర్చు ఇంకాస్త ఎక్కువే ఉంటుంది.

షేర్ అండ్ టూర్
ఒక ఫ్యామిలీనే వెళ్తే ఖర్చు ఎక్కువే అవుతుంది మరి. అదే నాలుగైదు ఫ్యామిలీస్ కలిసి వెళ్తే?.. ఖర్చు తప్పకుండా తగ్గుతుంది. ఖర్చులను షేర్ చేసుకోవడం వల్ల డెఫినెట్‌గా బడ్జెట్ తగ్గుతుంది. కానీ నాలుగైదు ఫ్యామిలీలు దొరికేదెలా? ఫ్రెండ్స్‌తో, నైబర్స్‌తో కలిసి వెళ్దామంటే.. మనకు కుదిరినప్పుడు వారికి కుదురొద్దా? ఇలాంటి మిడిల్ క్లాస్ మ్యూజింగ్స్ నుంచి పుట్టిందే బడ్జెట్ హాలిడేస్ ఇండియా మీటప్ గ్రూప్. హైదరాబాద్ నగరానికి చెందిన పర్యాటక ప్రేమికులు ఒక సంవత్సరం క్రితం ఈ మీటప్ గ్రూప్‌ని ప్రారంభించారు.

ఏంటీ గ్రూప్?
tour_4బడ్జెట్ హాలిడేస్ ఇండియా మీటప్ గ్రూప్‌లో ప్రస్తుతం ఐదు వందల మందికిపైనే సభ్యులున్నారు. ఈ గ్రూప్‌కి రాము కల్లేపల్లి ఆర్గనైజర్‌గా ఉన్నారు. ఆయనకు పర్యాటకరంగం మీద మంచి అవగాహన ఉంది. ట్రావెల్ స్పైస్ (travelspice.com) వెబ్‌సైట్ ఈ టూర్‌లను స్పాన్సర్ చేస్తోంది. ఇప్పటి వరకు రాము 266 టూర్లను ప్లాన్ చేశారు. పోయిన సంవత్సరం కంటే ఈ ఏడాది ఈ మీటప్ టూర్స్‌కి మంచి స్పందన లభిస్తోందని చెబుతున్నారాయన. వచ్చే ఏడాదిలోగా ఐదు వేల మంది ఇందులో సభ్యులుగా చేరతారన్న నమ్మకం ఉందని చెప్పారు రాము.

ఒకరోజు టూర్‌తో మొదలై...
‘మార్చి 21, 2011న ప్రారంభమైన ఈ గ్రూప్‌లో మొదట చాలామంది ఒక్కరోజులో వెళ్లి వచ్చేలా టూర్‌ను అరేంజ్ చేయమని కోరేవారు. ఇంకొందరు రెండు మూడు రోజులు ఆయా ప్రాంతాల్లో గడిపేలా టూర్‌లు అరేంజ్ చేయమనేవారు. అలా నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి కేరళ, ఊటీ వరకు టూర్‌లు మొదలయ్యాయి. ఇప్పుడు నెలకు నాలుగు నుంచి ఐదు టూర్ల వరకు ప్లాన్ చేస్తున్నామ’ని చెప్తున్నారు కో-ఆర్గనైజర్ ప్రణీల్. ‘త్వరలో మరో టూర్ కూడా ఉంది. మే 24న కేరళకు ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు రాము.

కొత్త స్నేహాలకు టూర్...
ఈ మీటప్ గ్రూప్‌లో కేవలం ఫ్యామిలీస్‌కు మాత్రమే ప్రవేశం ఉంటుంది. చిన్న పిల్లలున్నవారికి మొదటి ప్రయారిటీ. ఎందుకని అడిగితే ‘పిల్లలు కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మనకంటే ఎక్కువగా ఆనందిస్తారు. త్వరగా ఇతరులతో కలిసిపోతారు. వారి ద్వారా పెద్దలు కూడా స్నేహితులయ్యే అవకాశం ఉంది. ఈ మీటప్స్ ద్వారా కొత్త పరిచయాలు, స్నేహాలు ఎన్నో కలుగుతాయ’ని చెప్పారు రాము.

ఖర్చు తగ్గించాలనే..
చాలామందికి టూర్‌లకు వెళ్లాలని ఉంటుంది. కానీ డబ్బు సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు మా గ్రూప్‌లో చేరి ఖర్చును తగ్గించుకోవచ్చు. మేం ఆయా ప్రాంతాల్లోని హోటల్స్, రెస్టారెంట్లు, క్యాబ్స్, టూరిస్ట్ బస్ ఆర్గనైజర్స్ అందరితో మాట్లాడి వీలైనంత వరకు ఖర్చుని తగ్గిస్తాం. ఎంత వరకు వారు తగ్గించగలరో అంత వరకు మేం బేరమాడుతూనే ఉంటాం. కేవలం 499 రూపాయలతో టూర్ ప్లాన్ చేసిన సందర్భాలూ ఉన్నాయి.
- రాము కల్లేపల్లి, బడ్జెట్ హాలిడేస్ ఇండియా మీడిప్ గ్రూప్ ఫౌండర్
ఫోన్ నెంబర్ : 040-23205444
వెబ్‌సైట్ : meetup.travelspice.com

టాప్ బడ్జెట్ టూర్స్
1. కొల్లూరు, పాపికొండలు
1 నైట్ / 2 డేస్
ప్యాకేజ్ : రూ. 1,999

2. గోవా ట్రిప్
3 నైట్స్ / 4 డేస్
ప్యాకేజ్ : రూ. 3,999

3. గోల్డెన్ ట్రయాంగిల్
4 నైట్స్ / 5 డేస్
ప్యాకేజ్ : రూ. 9,499

4. కర్ణాటక, ఊటీ
4 నైట్స్ / 5 డేస్
ప్యాకేజ్ : రూ. 9,999

5. కేరళ, మున్నార్
3 నైట్స్ / 4 డేస్
ప్యాకేజ్ : రూ. 9,999

6. చార్మింగ్ మనాలి
3 నైట్స్ / 4 డేస్
ప్యాకేజ్ : రూ. 9,999

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

ప్రేమే కదా(కాదు) జీవితం

ప్రేమే కదా జీవితం అంటారు కొందరు. ప్రేమే కాదు జీవితం అంటారు ఇంకొందరు. ఈ రెండూ భిన్న ధృవాలు. రైలు పట్టాలు. ఎప్పుడూ కలవవు. కానీ అవి అతని జీవితంలో కలిశాయి. అదే విధి ఆడిన వింత నాటకం. పది మందీ నేర్పలేని గుణపాఠం. మాదో చిన్న పల్లెటూరు. వందల్లో ఇల్లు. మందల్లా మనుషులు. ఎవరి పోకడ వారిది. చీమ కదిలినా గుసగుస. అమ్మాయిలతో మాట్లాడటం... అదో పెద్ద తప్పు. నా స్నేహితుని పేరు వెంకట్‌. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలని వాడిదో కోరిక. కానీ ఏ అమ్మాయీ నచ్చేది కాదు. వెంకట్‌ హైదరాబాద్‌లో జాబ్‌ చేస్తుండేవాడు. చాలా రోజుల తర్వాత సంక్రాతికి ఊరొచ్చాడు. మా ఊళ్లో సంక్రాంతి క్రీడోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అప్పుడు ఊరంతా అక్కడే. కబడ్డీ ఫైనల్స్‌. అందరి కళ్లూ వారిపైనే. కానీ వెంకట్‌ కళ్లు మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నాయి. అప్పుడు కనిపించింది ఓ అమ్మాయి లంగా ఓణీలో. సినిమాల్లో తప్ప ఓణీలో అమ్మాయిని చూసి చాలా రోజులైందట. అలానే చూస్తుండి పోయాడు. సడన్‌గా ఆ అమ్మాయి వెంకట్‌ వైపు చూసింది. ఆమె చూపుల్లో కోపం. అతని చూపుల నుండి తప్పించుకోవాలని ఆమె అటూ ఇటూ తిరగసాగింది. కానీ వెంకట్‌ చూపులు ఆమె వెంటే పరుగెత్తాయి. ఎవరా అమ్మాయి? ఆరా...

మరిచిపోలేని బహుమతి

నేను అప్పుడు ఏడో తరగతి చదువుతున్నా. ఓ మోస్తారుగానే చదివేవాడిని. ఒక రోజు లెక్కల మాష్టారు నారాయణగారు పాఠం చెబుతున్నారు. ఒక లెక్క ఉదాహరణగా చెప్పి రెండో లెక్క మాతో చేయించేవారు ఆయన. అలా ఒకరోజు ఎవరు త్వరగా చేస్తే వాళ్లకు ఒక బహుమతి ఇస్తానన్నారు. నేను టకటకా మొదలెట్టా. నాకంటే బాగా లెక్కలు చేసేవారు మాత్రం "మాష్టారూ! ఏం గిఫ్ట్‌ ఇస్తారు? ఇప్పుడే ఇస్తారా తర్వాత ఇస్తారా?'' ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. నేను ముందుగా చేసి చూపించా. ఆయన వెంటనే తన జేబులోంచి పెన్ను తీసి నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ పెన్ను కొన్ని సంవత్సరాల పాటు పోగొట్టకుండా కాపాడుకున్నా. నేను ఇంటర్‌ చదివేప్పుడు మా క్లాసులో స్వప్న అని ఒక ఫ్రెండ్‌ ఉండేది. ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే క్లాస్‌లో వాణి మేడమ్‌ సమక్షంలో ఘనంగా జరుపుకునే వారం. మా క్లాసులో చాలా తక్కువ మందే ఉండేవారు. అలా ఒకరోజు నా పుట్టినరోజు వచ్చింది. క్లాస్‌లోనే కేక్‌ కట్‌ చేయించారు. ఒకరి పుట్టిన రోజు వస్తుందంటే ఎలాగూ రెండు మూడు రోజుల నుంచి చర్చలు జరుగుతాయి. కాబట్టి అందరూ గిఫ్ట్‌లు తీసుకుని వచ్చారు. కానీ స్వప్న మాత్రం నాకు ఎలాంటి బహుమతి ఇవ్వలేదు. (అంటే బహుమతి కోసమే పుట్టిన రోజు...