‘‘హౌ ఆర్ యు మై బోయ్? నేను, మీ అమ్మ బావున్నాం. నిన్ను చాలా మిస్ అవుతున్నాం. వెంటనే చూడాలనిపిస్తోంది. సో.. నీ పీసీ ఆఫ్ చేసి కిందికి వచ్చేసెయ్. కలిసి భోజనం చేద్దాం...’ ఒక తండ్రి తన కొడుకు ఫేస్‌బుక్ వాల్‌పై ఇలా పోస్ట్ చేశాడు.
ఒకతనికి ఉరిశిక్ష పడింది. ‘నీ చివరి కోరిక ఏంటి?’ అని అడిగాడు జడ్జి. ‘నన్ను ఉరితీస్తున్నట్లు నా ఫేస్‌బుక్ స్టేటస్‌ని అప్‌డేట్ చేయాలి’ సమాధానమిచ్చాడతడు. ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. ఆంబుపూన్స్‌లో ఆస్పవూతికి తీసుకొచ్చారు. కండీషన్ సీరియస్‌గా ఉందని చెప్పాడు డాక్టర్. ‘మీ వాళ్లకి ఏమైనా చెప్పాలా? అడిగింది నర్స్. ‘ఒకవేళ నేను చనిపోతే నా మొహంపైన వెంటనే గుడ్డ కప్పేయండి. లేదంటే మా ఫ్రెండ్స్ వీడియో తీసి యూట్యూబ్‌లో పెడతారు’ సమాధానమిచ్చాడు అబ్బాయి.
యూట్యూబ్ అంటే ట్యూబ్‌లు టైర్లు అమ్మే దుకాణం అని అనుకునేవాళ్లు కొందరుండొచ్చేమో. కానీ యూట్యూబ్‌లో రోజంతా వీడియోల్నే చూస్తూ కూర్చునేవారు అంతకంటే ఎక్కువే ఉంటారు. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు. నాలెడ్జ్ పెంచుకునేందుకు యూట్యూబ్ చాలా ఉపయోగపడుతుంది. కానీ దాన్ని ఆ మార్గంలో ఉపయోగించేవారితో పాటు నెగెటివ్‌గా ఉపయోగించేవాళ్లూ ఉన్నారు. ఐదేళ్ల క్రితం యూట్యూబ్ వాడకం తక్కువగానే ఉండేది. కానీ అప్పట్లోనే ఢిల్లీలో ఒక టీనేజ్ కుర్రాడు తన గర్ల్‌వూఫెండ్‌తో చేసిన రొమాన్స్‌ని రహస్యంగా సెల్‌ఫోన్ కెమెరాతో చిత్రీకరించి యూట్యూబ్‌లో పెట్టాడు. ఆ తర్వాత అలాంటివి అప్పుడప్పుడూ సెన్సేషన్ సృష్టిస్తూనే ఉన్నాయి. ఇంటర్‌నెట్ కేఫ్‌లలో సీన్లు, బట్టల దుకాణాల్లో అమ్మాయిలు దుస్తులు మార్చుకునే వీడియోలు చాలానే అప్‌లోడ్ అయ్యాయి. అంటే ప్రయివేటు లైఫ్‌కు కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది. మెల్ల మెల్లగా యూట్యూబ్ కొన్ని వీడియోల్ని సెన్సార్ చేసింది. కానీ ఇది జరగాల్సిందంతా జరిగి పోయాకే జరిగింది.

Comments