Skip to main content

Posts

చేయూతనందిస్తే చేజారదు జీవితం

కళ్ల నిండా నీళ్లు కమ్ముకు పోయి, మనసు నిండా దిగులు నిండుతూ పోయే సందర్భాలు ప్రతి ఒక్కరికీ ఎన్నెన్నో. ఓటమో, ఆశాభంగమో, అవమానమో మనసును తీవ్రంగా గాయపరిస్తే ఒంటరిగా మగ్గే క్షణాలు ఏదో సందర్భంలో అందరికీ అనుభవం లోకొచ్చేవే. ఆ సమయంలో తమను తాము ఓదార్చుకునే ఆత్మస్థైర్యం అందరికీ ఉండకపోవొచ్చు. ఓదార్చే తోడూ దొరక్కపోవచ్చు. ఆ బలహీన క్షణంలో మదిలో మెదిలే ఒకే ఒక్క ఆలోచన... 'ఆత్మహత్య'. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలంటారు. ఆత్మహత్యకు పాల్పడే వారు కూడా తమ చావుకు అన్ని కారణాలు చెబుతుంటారు. జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలి ఉంటుంది. అదే భవిష్యత్తు. ఇది ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు గ్రహించరు కాబోలు. కాలం గడిచి... మనకూ మంచి రోజులు వచ్చాక ఆ పాత అనుభవాన్ని గుర్తుచేసుకుంటే. ఆ ఆలోచన ఎంతటి తప్పో తెలుస్తుంది. మరి తమకు తాము అంతటి సమయం కూడా ఇచ్చుకోకుండా క్షణికావేశంలో ఆత్మహత్మకు పాల్పడే వారు చాలామంది ఉంటారు. అలాంటి వారిని ముందే గుర్తించి చేయూతనందిస్తే వారి జీవితం చేజారదు.  మారుతున్న పరిస్థితులతో పాటు మానవతా విలువల్లో, జీవన విధానాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  యువత అన్ని రంగాల్లో ఎంత వేగంగ...

గది నేర్పిన పాఠం

మనసు పెట్టి చూస్తే మట్టిలో సైతం అందాలు కనిపిస్తాయి. అది చూసే కనులని బట్టి ఉంటుంది. ఈ ప్రపంచంలో మనం ప్రతి వస్తువు నుంచి, ప్రతి ప్రాణి నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. నా గది నాకు నేర్పిన కొన్ని పాఠాలు.   రూఫ్‌ ః మీ ల క్ష్యం ఎప్పుడూ గొప్పగా తన అంత ఎత్తులో ఉండాలని చెప్పింది.  ఫ్యాన్‌ ః ఎప్పుడూ ప్రశాంతంగా ఉండమని చెప్పింది.   గడియారం ః ప్రతి నిమిషమూ విలువైనదే అని ప్రతి సెకనూ టక్‌ టక్‌మని చెబుతూనే ఉంది.  అద్దం ః ఏదైనా చేయబోయే ముందు ఓసారి పరీక్షించుకోండి. లేదంటే తెలుసుకోండి. కిటికీ ః ప్రపంచాన్ని చూడమంటోంది.  క్యాలెండర్‌ ః అప్‌ టు డేట్‌ ఉండమంది.  డోర్‌ ః మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు బాగా కష్టపడితే ఇలాంటి ద్వారాలు ఎప్పుడూ మీ కోసం తెరిచే ఉంటాయట.  

ప్రపంచంలో కొన్ని గొప్ప అబద్ధాలు

1. చెక్కు మెయిల్‌ చేశాను.  2. నేను గవర్నమెంట్‌ సర్వెంట్‌ని, మీకు సహాయం చేయడానికి వచ్చాను. 3. హే! నేను ఆ డబ్బులు నీకు ఇచ్చేశాననుకుంటా. 4. మీకు ప్రామిస్‌ చేస్తున్నాను. వచ్చే శుక్రవారం తప్పకుండా ఇస్తాను.  5. ఇంత ఘనం ఎప్పుడూ తాగలేదు.  6. హా.. బాగానే ఉన్నా.  7. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 8. మీరు సన్నగానే ఉన్నారు. మీ బట్టల వల్లే లావుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.  9. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.  10. పది మందిలో తొమ్మిది మంది అదే చెప్పారన్న సర్వే... 11. దయచేసి లైన్‌లో ఉండండి. మా కస్టమర్‌ కేర్‌ రిప్రజెంటేటివ్‌ మీతో మాట్లాడతారు.  12. ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. 13. మీరు కావాల్సినంత బరువు కోల్పోతారు.  14. నేను డైవర్స్‌ తీసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నాను. త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను.  15. లేదు లేదు నీను కాసేపట్లో కాల్‌ చేస్తాను.  16. నిజంగా నాకు తెలియదు ఎవరలా చేశారో.  17. నాకు తెలుసు అది నా పని కాదని.  18. అది నా వ్యసనం కాదు. నేను ...

మరిచిపోలేని బహుమతి

నేను అప్పుడు ఏడో తరగతి చదువుతున్నా. ఓ మోస్తారుగానే చదివేవాడిని. ఒక రోజు లెక్కల మాష్టారు నారాయణగారు పాఠం చెబుతున్నారు. ఒక లెక్క ఉదాహరణగా చెప్పి రెండో లెక్క మాతో చేయించేవారు ఆయన. అలా ఒకరోజు ఎవరు త్వరగా చేస్తే వాళ్లకు ఒక బహుమతి ఇస్తానన్నారు. నేను టకటకా మొదలెట్టా. నాకంటే బాగా లెక్కలు చేసేవారు మాత్రం "మాష్టారూ! ఏం గిఫ్ట్‌ ఇస్తారు? ఇప్పుడే ఇస్తారా తర్వాత ఇస్తారా?'' ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. నేను ముందుగా చేసి చూపించా. ఆయన వెంటనే తన జేబులోంచి పెన్ను తీసి నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ పెన్ను కొన్ని సంవత్సరాల పాటు పోగొట్టకుండా కాపాడుకున్నా. నేను ఇంటర్‌ చదివేప్పుడు మా క్లాసులో స్వప్న అని ఒక ఫ్రెండ్‌ ఉండేది. ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే క్లాస్‌లో వాణి మేడమ్‌ సమక్షంలో ఘనంగా జరుపుకునే వారం. మా క్లాసులో చాలా తక్కువ మందే ఉండేవారు. అలా ఒకరోజు నా పుట్టినరోజు వచ్చింది. క్లాస్‌లోనే కేక్‌ కట్‌ చేయించారు. ఒకరి పుట్టిన రోజు వస్తుందంటే ఎలాగూ రెండు మూడు రోజుల నుంచి చర్చలు జరుగుతాయి. కాబట్టి అందరూ గిఫ్ట్‌లు తీసుకుని వచ్చారు. కానీ స్వప్న మాత్రం నాకు ఎలాంటి బహుమతి ఇవ్వలేదు. (అంటే బహుమతి కోసమే పుట్టిన రోజు...

టాలీవుడ్‌ బ్లాగర్స్‌

నేను బ్లాగర్‌గా కొత్త. కానీ కొంత కాలంగా బ్లాగులను గమనిస్తూనే ఉన్నాను. కామెంట్స్‌ విషయంలో ప్రత్యేక నిబంధనలు ఏమీ లేవని నేను గమనించాను. అభిప్రాయాలను నేరుగా తెలపడం పట్ల ఆశ్చర్యపడ్డాను. విమర్శలను సున్నితంగా తెలపడం పట్ల ఆనందపడ్డాను. కానీ వారం రోజులుగా కొన్ని బ్లాగుల(అరుణమ్‌, గోన్‌విత్‌ఇన్‌, చెరుకురసమ్‌) మధ్య ఘాటైన వాదన జరుగుతోంది. ప్రశంసలు వచ్చినప్పుడు పొంగి పోవడం.. విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోవడం సరికాదు అని నేను అనుకుంటున్నాను. బ్లాగర్ల మధ్య వివాదం రావడం ఇది కొత్తేమి కాదు. బాలీవుడ్‌లో మొదట బ్లాగ్‌ మొదలు పెట్టింది అమీర్‌ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌లు. అయితే అమీర్‌ఖాన్‌ "తాను కొత్తగా కొన్న బంగ్లా వాచ్‌మెన్‌ కుక్కపేరు షారూఖ్‌'' అని తన బ్లాగులో పోస్ట్‌ చేశారు. ఇది షారూఖ్‌, అమీర్‌ ఖాన్‌ల మధ్య వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఆ ఇద్దరు ఖాన్‌లు ఓ అండర్‌స్టాండింగ్‌కు వచ్చారు. బ్లాగింగ్‌ అనేది మనోభావాల్ని నేరుగా తెలిపేందుకు అనువైనదని, దీన్ని వివాదంగా కాకుండా సానుకూలంగా స్పందించాలని వారు అటు తర్వాత బ్లాగారు. ఆ తర్వాత బిగ్‌బీ అమితాబ్‌ ఈ బ్లాగర్ల జాబితాలోకి చేరిపోయారు. బ్లాగ్‌ మొదలెట్టిన కొద్ది...

మా ఊరెంత మారింది...

నల్గొండలో బస్సు దిగి మా ఊరి బస్సు ఎక్కగానే నాలో తెలియని ఉద్వేగం. ప్రియురాలి కోసం ఎదురుచేసే ప్రియుడిలా... కదలని కాలం.. తగ్గిని దూరం... అలా కళ్లు మూసుకున్నా. చిన్ననాటి జ్ఞాపకాల పొరలు ఒక్కసారిగా విచ్చుకున్నాయి. సినామా రీళ్లలా గిరిగిరా తిరిగాయి... కిటికీలోంచి చల్లని గాలి వీచింది. ఉలిక్కి పడి లేచి చూస్తే.. మా ఊరి పొలిమేర... "ఈ ఊరు... ఈ గాలి... ననుగన్న నా వాళ్లు...'' మనసు మౌనంగా పాడింది. ఇదే మా ఊరి చెరువు. వర్షాలు పడినప్పుడు రోడ్డు మీద మోకాలు లోతు నీళ్లు వచ్చేవి. మా ఊరి బళ్లో ఐదో తరగతి వరకే ఉంది. ఆ తర్వాత పక్క ఊరికి వెళ్లాల్సిందే. చెప్పులు చేతిలో పట్టుకుని పుస్తకాల సంచి తలపై పెట్టుకుని స్కూలుకు వెళ్లేందుకు వాగు దాటేవాళ్లం. ఆ నీటి తడి స్పర్శ ఒక్కసారి కాళ్లకు తాకినట్లు అనిపించింది ఆ జ్ఞాపకం. భుజాన నాగలి ఎత్తుకుని వెళ్తున్నారే.. వాళ్లు మా ఊరి రైతులే. కోడవళ్లు చేతిలో పెట్టుకుని పొలం గట్టు వెంట వెళ్తున్న ఆడపడుచులు కూడా మా ఊరి కూలీలే. అదిగో మల్లయ్య తాత.. ఎడ్లబండి... ఆ ఎడ్లు కవలల్లా ఉంటాయి. వాటి పేర్లేంటో తెలుసా? రామ, లక్ష్మణులు. అదే మా ఊరి బడి. రెండెక్కం నేర్పిన తొలి దేవాలయం. నేను ఐ...

నా ప్రియ శత్రువు

ఆగస్టు 16, 2004... మధ్యాహ్నం 1.40... ఆ రోజు తొలిసారిగా చంటిని చూశాను. డిగ్రీ పూర్తయ్యాక అతను నేను పనిచేస్తున్న స్కూల్లో టీచర్‌గా చేరాడు. నేను చాలా రిజర్వ్‌డ్‌. కొత్త వాళ్లతో చాలా తక్కువ మాట్లాడేదాన్ని. స్నేహితులతో మాత్రం తెగ వాగేస్తాను. చంటి ఎప్పుడూ నాతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. తొందరలోనే నాకు మంచి స్నేహితుడయ్యాడు. కొన్ని నెలల తర్వాత తను నన్ను ప్రేమిస్తున్నట్లుగా అర్థమైంది. కానీ తను మాటల్లో చెప్పే వాడు కాదు. తన చేతల్లో మాత్రం అది కనిపించేది. నా ప్రేమ కోసం అతను వేసే ప్రతి అడుగు అతనికి కలిసొచ్చేది. చివరికి నా స్కూటీ కూడా. చలికాలంలో సాయంత్రం.. నలుగురు కిక్‌ కొట్టినా స్టార్ట్‌ అవ్వని బైక్‌ అదేంటో అతను మాత్రం ఒకే కిక్‌తో స్టార్ట్‌ చేసేవాడు. ఓ సారి నా చిన్నప్పటి ఫోటో చూపించాను. రెండు నిమిషాలే చూసి... తిరిగి ఇచ్చేశాడు. మరుసటి రోజు నా బొమ్మ తీసుకొనే తెచ్చాడు. అది నా ఫొటో పక్కన పెట్టి పోలిస్తే అచ్చుకొట్టినట్లే ఉందది. గీత కూడా పొల్లు పోలేదు. అది చూసి మొదటి సారి అతని మీద అభిమానం కలిగింది. రెండు నిమిషాలు చూసిన బొమ్మలు అలా ఎలా వెయ్యగలిగాడని చాలా రోజులు ఆలోచించా.తర్వాత ఓసారి మా అన్నయ్య ...